భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: అనాథలకు అండగా నిలుస్తూ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఎండీఆర్ ఫౌండేషన్ మరోసారి తన ఉదారతను చాటుకుంది. మాదాపూర్‌లోని జాయ్ ఫౌండేషన్ ఆశ్రమంలో నివసిస్తున్న ఎన్.వి. పాండురంగారావు (92) అనే వృద్ధుడు అనారోగ్యంతో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. ఆయనకు ఎవరూ లేకపోవడంతో MDR ఫౌండేషన్ బాధ్యత తీసుకుంది.
ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాద్రి పృథ్వీరాజ్ ఆర్థిక సహకారంతో, మృతుడిని తమ కుటుంబ సభ్యుడిగా భావించి హిందూ సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. గత మూడు నెలలుగా హాస్పిటల్‌లో చికిత్స…





