భార‌త్ స‌మాచార్.నెట్, సంగారెడ్డి: సదాశివపేట పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పట్టణానికి చెందిన తాటికొండ వైద్యనాథ్ దంపతులు శుక్రవారం అమ్మవారిని దర్శించుకున్నారు. అనంత‌రం రూ.2లక్షల విలువైన నగల హారాన్ని అమ్మవారికి బహుకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తాటికొండ వైద్యనాథ్ దంపతులను సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్య‌క్ర‌మంలో ఆల‌య క‌మిటీ స‌భ్యులు, భ‌క్తులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

భారీ వర్షాల నేపథ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి: ఎస్పీ