భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: ఎర్గట్ల మండలం తోర్తి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరి స్కూల్ ఇంగ్లిష్ మీడియం లో 43 మంది స్టూడెంట్స్, హైస్కూల్ లో 31మంది స్టూడెంట్స్ తో స్కూల్ విజయవంతంగా నడుస్తుంది. ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షలకు 8 మంది విద్యార్థులు హాజరు కాగా 100% ఉత్తీర్ణులయ్యారు. అయితే ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా బోధిస్తున్నాo.. మీ పిల్లల్ని మా స్కూల్‌కు పంపండి, మీ పిల్లల్ని ప్రతిభ వంతులుగా తీర్చి దిద్దుతాం.. మాకొక్క అవకాశం ఇచ్చి చూడండి…