భారత్ సమాచార్.నెట్, నిజామాబాద్ జిల్లా : బోధన్ మున్సిపల్ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కమిషనర్ జాదవ్ కృష్ణ ఆదేశించారు. పట్టణంలోని 38 వార్డుల కోసం 13 క్లస్టర్లను ఏర్పాటు చేసి, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించారు. నిబంధనల ప్రకారం ఏ అధికారి కూడా తమ సొంత వార్డులో విధులు నిర్వహించకూడదని స్పష్టం చేస్తూ, కొందరు అధికారులను ఇతర వార్డులకు బదిలీ చేస్తూ స్వాపింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల కోసం మరో నాలుగు బృందాలను రిజర్వ్‌లో ఉంచారు.…