భార‌త్ స‌మాచార్‌.నెట్, యాదాద్రి భువనగిరి: రైతాంగానికి యూరియా పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మోత్కూర్ బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షుడు పోచం సోమయ్య ఆరోపించారు. సోమవారం పత్రిక ప్రకటన విడుదల చేస్తూ ఖరీఫ్ సీజన్ కు రైతులకు కావాల్సిన రసాయనిక‌ ఎరువులు సమకూర్చడంలో వ్యవసాయ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక ఏర్పాటు చేసుకోకపోవడమే ఎరువుల కొరతకు కారణమని అన్నారు. మోత్కూర్ లో రైతు సేవా సహకార సంఘంలో సోమవారం వచ్చిన యూరియా పంపిణీ సిబ్బంది క్రమ పద్ధతిలో పంపిణీ…