భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామస్తులు ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలోని కోరిన కోరికలు తీర్చే మహిమాన్విత శ్రీ ముత్యాలమ్మ తల్లికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా బుధవారం బోనాలు చేశారు. ఎడ్లబండ్లు, ఆటోలు, ట్రాక్టర్లు, కార్లలో భక్తులు తరలివచ్చి దేవస్థానం చుట్టూ కుటుంబాల సమేతంగా ప్రదక్షిణలు చేశారు. అమ్మవారికి పట్నాలు వేసి అనంతరం శివ శక్తుల పూనకాల జోరు, డప్పు చప్పుళ్ల హోరులో మహిళలు సామూహికంగా బోనాలను ఎత్తుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి లోకపావనులైన శ్రీ ముత్యాలమ్మ, మారమ్మ,…
చిన్ననాగారం ముత్యాలమ్మ తల్లికి ఘనంగా బోనాలు





