భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని సోలాక్ పల్లి గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు గ్రామానికి చెందిన అతినారం రేణుక పెంటేష్ గౌడ్ దంపతులు శాలువా కప్పి స్వీట్స్ పంచుకున్నారు. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర గ్రామ పారిశుద్ధ్య కార్మికులదేనని, ఎండనకా వాననకా చలినకా లెక్కచేయకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమించే కార్మికుడు పారిశుద్ధ్య కార్మికులేనని, వారి సేవలను…