భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గురుపౌర్ణమి పర్వదినం సందర్భంగా మెదక్ జిల్లా శివంపేట మండలం గూడూరు గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ గురుపీఠం, శ్రీ సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసిని రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీ దత్తాత్రేయ గురుపీఠం ఫౌండర్-చైర్మన్ జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్, ట్రస్ట్ సభ్యురాలు రమాదేవి ఆధ్వర్యంలో గురుపౌర్ణమి విశేష పూజలు నిర్వహించారు. వేదపండితులు…