భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఓ యువకుడు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను నెల్లికుదురు ఎస్సై చిర్ర రమేష్ బాబు వెతికి పట్టుకొని బాధితుడికి అప్పగించాడు. మండలంలోని ఆలేరు గ్రామానికి చెందిన చీకటి నవీన్ పనిపై తన స్వగ్రామం నుంచి నెల్లికుదురుకు బైక్ పై వెళుతున్న క్రమంలో మార్గమధ్యంలో రూ.20 వేల విలువగల ఫోన్ పోయింది. దీంతో బాధితుడు సీఈఐఆర్ ఆన్లైన్ పోర్టల్ లో ఆన్లైన్ చేసుకొని నెల్లికుదురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్సై రమేష్ బాబు ట్రేస్ చేసి…