భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా : పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని సర్పంచి రేణుక నరేష్ పేర్కొన్నారు. ఇనుగుర్తి మండలం పెద్దతండ (సీఎం) అంగన్వాడీ కేంద్రంలో టీచర్ బానోతు లలిత ఆధ్వర్యంలో శనివారం ‘ఈసీసీఇ (ECCE) డే’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు ఆటబొమ్మలు, విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలపై అవగాహన కల్పించారు.

ముఖ్యఅతిథిగా హాజరైన సర్పంచి మాట్లాడుతూ.. గర్భిణీలు, బాలింతలు, పిల్లల ఆరోగ్యం కోసం ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని, ఇతర సామాగ్రిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.…