భారత్ సమాచార్, జగిత్యాల జిల్లా: కోరుట్ల – మెట్‌పల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్టును వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో కారులో ఉన్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కోరుట్ల పట్టణానికి చెందిన ఏడుగురు యువకులు కారులో కోరుట్ల నుంచి మారుతీనగర్ దాబా దగ్గర చాయ్ తాగడానికి వెళ్తుండగా వేగంగా చెట్టును ఢీకొట్టడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను జగిత్యాల, కరీంనగర్ ఆసుపత్రులకు తరలించారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.





