భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తన భార్య ఆత్మహత్యాయత్నానికి కారణమైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఎన్‌ఎం రజిని భర్త నర్సింగ్ రావు పోలీసులను ఆశ్రయించారు. వెల్దుర్తి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న రజిని, డాక్టర్ శిరీష, డాక్టర్ సౌజన్యల మానసిక వేధింపులు భరించలేక ఈ నెల 27న బలవన్మరణానికి ప్రయత్నించినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం రజిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై చట్టపరమైన చర్యలు…