భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పవిత్రమైన రంజాన్ మాసం సోదరభావం, సహనం, పరస్పర గౌరవానికి ప్రతీక అని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరుల కోసం బుధవారం మెదక్ పట్టణంలోని క్రిస్టల్ గార్డెన్స్ లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రంజాన్ మాసం ప్రేమ, శాంతి, సహకారం పెంపొందించే పవిత్రమైన కాలమని అన్నారు. ఉపవాస దీక్ష ద్వారా మనసును పవిత్రం చేసుకోవడం, అవసరంలో ఉన్నవారికి…