భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: నాగారం మండలం వర్ధమానుకోట గ్రామంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను నాగారం ఎస్సై చిరంజీవి ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజామున ఒకటి గంటల ప్రాంతంలో చాకచక్యంగా పట్టుకున్నారు. సోమవారం పేరబోయినగూడెంలో జాజిరెడ్డిగూడెం మండలం ఉయ్యాలవాడకు చెందిన రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై చిరంజీవి తెలియజేశారు. సాండ్ టాక్స్ లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లపై ఎస్సై చిరంజీవి కొరడా ఝళిపించారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.