భారత్ సమాచార్, మెదక్ జిల్లా: హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వాచ్‌మెన్ స్వామి, అటెండర్ రాజుకు కోర్టు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు జిల్లా ఎస్పీ డీవీ. శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థినుల భుజాలపై చేతులు వేయడం, వారు బట్టలు మార్చుకునే సమయంలో రహస్యంగా గమనించడం వంటి ఘటనలపై ఆగష్టు 2018లో ఫిర్యాదు అందినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై అప్పటి తూప్రాన్ ఎస్‌ఐ నాగార్జున గౌడ్ కేసు నమోదు చేశారు. అనంతరం అప్పటి ఐఓలు డీఎస్పీ తూప్రాన్ రాంగోపాల్ రావు, కిరణ్…