భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మరింత పురోగతి సాధించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. నిజమైన అర్హులైన నిరుపేదలకు మాత్రమే పక్కా ఇళ్లు అందేలా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై హౌసింగ్ పీడీతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెండో…





