భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఉపాధి హామీ పని ప్రదేశంలో కూలీలకు వసతులు కల్పించాలని సీపీఐఎం ఇనుగుర్తి మండల కార్యదర్శి గొడిషాల వెంకన్న సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఇనుగుర్తిలోని ఉపాధి హామీ పనుల క్షేత్రాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఉపాధి కూలీలకు అందుతున్న వసతులపై ఆరా తీశారు. ఫిబ్రవరి మాసంలోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని వెంటనే టెంటు, మజ్జిగ, మంచినీటి వసతి కల్పించాలన్నారు. కూలీలకు తవ్వకం పనులను ఎక్కువగా నిర్దేశించడంతో వారు ఎండలో తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన…
ఉపాధి కూలీలకు మౌలికవసతులు కల్పించాలి





