భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా : తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో సాధారణ ఎన్నికల పరిశీలకురాలు భారతి లక్పతి నాయక్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి, అధికారులకు ముఖ్య సూచనలు చేశారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్నందున పోలింగ్ కేంద్రాలకు వెంటనే మార్కింగ్ పనులు చేపట్టాలని ఆమె ఆదేశించారు. నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను కోరారు.
అనంతరం తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత…





