భార‌త్ స‌మాచార్.నెట్, మహబూబాబాద్ : సమీకృత వ్యవసాయం అందరికీ శ్రేయస్కరమని జిల్లా సేంద్రియ ఆదర్శ రైతు పెండెం వెంకన్న పటేల్ అన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా అయ్యగారిపల్లిలోని తన ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులు కేవలం పంటలపైనే కాకుండా సాగు భూముల్లో నాటు కోళ్లు, చేపల పెంపకం చేపట్టాలని సూచించారు. దీనివల్ల కల్తీ లేని పోషకాహారం లభిస్తుందని తెలిపారు.

ప్రతి రైతు గోవును పెంచాలని, గోఆధారిత వ్యవసాయం వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు పౌష్టికమైన పాలు అందుతాయని పేర్కొన్నారు.…