భారత్ సమాచార్, (ఇనుగుర్తి), మహబూబాబాద్ జిల్లా: ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియలో భాగంగా ఇనుగుర్తి మండలంలో ఓటర్ల నమోదు డిజిటలైజేషన్ కార్యక్రమం తుది దశకు చేరుకుందని మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ బషీర్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని 59, 60, 61, 62 పోలింగ్ స్టేషన్‌ల సముదాయాన్ని ఆయన సందర్శించి డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. బీఎల్‌వోలు, పర్యవేక్షకులతో మాట్లాడి పనుల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆర్‌ఐ బషీర్ మాట్లాడుతూ, మండలంలో మొత్తం 18,216 మంది ఓటర్లు ఉండగా ఇప్పటివరకు 18 వేల…





