భారత్ సమాచార్.నెట్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం శ్రీ జగన్నాథ రథయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు ఇస్కాన్ నిర్వాహకులు. న్యూ టౌన్‌లోని టీటీడీ కళ్యాణ మండపం నుండి ప్రారంభమైన రథయాత్ర పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఉత్సాహభరితంగా జగన్నాథ యాత్ర కొనసాగింది. ఈ యాత్రలో జగన్నాథుడిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు భక్తులు.
జగన్నాథ రథ యాత్ర సందర్భంగా స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. స్వామివారి భజనలు, నృత్యాల నడుమ రథాన్ని ముందుకు లాగారు భక్తులు. ప్రధాన…





