భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: దుబ్బాక మండలం గోసాన్ పల్లి గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. గ్రామానికి చెందిన అస్క నర్సింలు ఇంటికి తాళం వేసి వంటిమామిడి ఆర్‌వీఎం ఆసుపత్రికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన దొంగలు తాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న 18 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.30వేల నగదును ఎత్తుకెళ్లారు. తాళం పగులగొట్టిన విషయాన్ని స్థానికులు తెల్లవారుజామున గమనించి నర్సింలుకు తెలియజేయడంతో ఆయన వెంటనే అక్కడికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.






