భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన అక్రెడిటేషన్ మార్గదర్శకాలపై జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నూతన జీఓ వల్ల వృత్తిపరమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగదని, కొందరు ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ…





