భారత్ సమాచార్.నెట్: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణలో ఖాళీగా ఉన్న జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 13వ తేదీన నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. అదే రోజే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని.. ఈ నెల 21 వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు పేర్కొంది.

2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గెలుపొందగా.. ఈ ఏడాది జూన్‌లో ఆయన గుండెపోటుతో…