భారత్ సమాచార్.నెట్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనారోగ్యం బారిన పడ్డారు. సీజనల్ జ్వరంతో బాధపడుతున్న ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం వైద్యులు కేసీఆర్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన రెగ్యూలర్ చెకప్ కోసమే యశోద ఆస్పత్రికి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ వెంట సతీమణి శోభ, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్‌లు ఉన్నారు.
ప్రస్తుతం కేసీఆర్‌ను వైద్యులు అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఆయన వయసు.. గతంలో ఉన్న ఆరోగ్య పరిస్థితులను పరిగణలోకి తీసుకుని వైద్యులు పరీక్షలు…





