భారత్ సమాచార్, భద్రాద్రికొత్తగూడెం జిల్లా: జిల్లాలో ట్రిపుల్ ఐటీ (IIIT) ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో కొత్తగూడెం 6వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ బి.ఎస్. రావు కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు పాదయాత్ర చేపట్టారు. గురువారం ఉదయం 7 గంటలకు కొత్తగూడెంలోని గణేశ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన పాదయాత్రను ప్రారంభించారు. సుమారు 40 కిలోమీటర్ల మేర నడిచి భద్రాచలానికి చేరుకున్న డాక్టర్ బి.ఎస్. రావు అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

ఈ సందర్భంగా డాక్టర్ బి.ఎస్.…