భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: బీఆర్ఎస్ (BRS) పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించేందుకు కేటీఆర్ రెడీ అవుతున్నారు. ఏడాదిన్నరలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ (Congress) సర్కారుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉందని.. రేవంత్ సర్కార్ కంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం ఉందని కేటీఆర్ స్పష్టం చేయనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 20న సూర్యాపేటలో.. 23న కరీంనగర్‌లో ముఖ్య…