భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: సికింద్రాబాద్ లష్కర్ బోనాలకు సర్వం సిద్ధమైంది. అమ్మవారి ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలను ప్రత్యేకంగా అలకరించారు. అమ్మవారి నామస్మరణ, పోతురాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో నేడు సికింద్రాబాద్ మారుమోగనుంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నేడు ఉజ్జయినీ మహంకాళి బోనాలు ఘనంగా నిర్వహించనున్నారు.
ఆదివారం తెల్లవారుజామున వేద మంత్రోచ్చారణలతో ఆలయ ద్వారం తెరిచారు. ప్రత్యేక పూజల అనంతరం బోనాలు సమర్పించేందుకు భక్తులకు అనుమతించనున్నారు. నగరం నలుమూలల నుంచి భక్తులు తరలి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. సాయంత్రం ఫలహారం బండ్ల ఊరేగింపు…