భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పశుగ్రాస దినోత్సవాన్ని పురస్కరించుకుని తూప్రాన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం రైతులకు పచ్చిగడ్డి పంపిణీతో పాటు శాస్త్రీయ పశుగ్రాస నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పశుసంపద అభివృద్ధికి నాణ్యమైన పశుగ్రాసం అత్యంత అవసరమని, సరైన మేతతో పశువుల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా పాల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరుగుతుందని కార్యక్రమంలో పాల్గొన్న నిపుణులు తెలిపారు. రైతులు ఆధునిక పద్ధతులను అనుసరిస్తే పశుపోషణ మరింత లాభదాయకంగా మారుతుందని సూచించారు.
ఈ సందర్భంగా పశుగ్రాస పంటల సాగు ప్రాధాన్యాన్ని వివరిస్తూ, గడ్డి…





