భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట దళిత, గిరిజన ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన, ధర్నా నిర్వహించారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గూగులోత్ కిషన్ నాయక్ మాట్లాడుతూ, వరుసగా పరీక్ష పత్రాల లీకేజీల కారణంగా కష్టపడి చదివే విద్యార్థులు…





