భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామపంచాయతీలో వాసన్ టాటా గ్రూప్ సహకారంతో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ కేంద్రాన్ని మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) టి. శాలిక బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయంపై ఆసక్తి ఉన్న పలువురు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులకు సేంద్రియ సాగు పద్ధతులను అందుబాటులోకి తీసుకురావడమే ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీడీవో టి. శాలిక మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా…





