భారత్ సమాచార్, రంగారెడ్డి జిల్లా: యాచారం మండలం ధర్నన్నగూడలో మల్లిఖార్జున స్వామి జీవిత చరిత్ర వీధి నాటకం ఘనంగా ప్రారంభమైంది. మల్లిఖార్జున భజన మండలి ఆధ్వర్యంలో ఈ నాటకాన్ని గురు, శుక్ర, శనివారాల్లో ప్రదర్శించనున్నారు. మొదటి రోజు చంద్రగుప్తుడిగా ముక్కెరి మధు, నీలమ్మగా బండ చెన్నయ్య, ఆదిరెడ్డిగా ముక్కెర రఘుపతి తమ నటనతో అలరించారు. ఈ వీధి నాటకాన్ని వీక్షించేందుకు వివిధ గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.