భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిని కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టు ఎదుట హాజరుపర్చారు. వేంపల్లి గ్రామానికి చెందిన నిందితుడు అడిగేమ్ రాజేశ్వర్(30) అనే వ్యక్తికి డ్రంక్ & డ్రైవ్ కేసులో ఐదు రోజులు సాధారణ జైలు శిక్షను ఆర్మూర్ జేఎఫ్‌సీఎం మేజిస్ట్రేట్ భావ్యశ్రీ శిక్ష విధించారని, ఎవరైనా మద్యం సేవించి వాహనం నడిపేతే జైలుశిక్ష లేదా రూ.10 వేల జరిమానా తప్పదని బాల్కొండ ఎస్సై శైలెందర్ తెలిపారు.
మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి జైలుశిక్ష





