భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మండలంలో ఆసుపత్రిలో వైద్యం కోసం వెళ్లిన ఒక వివాహిత తన రెండేళ్ల కూతురుతో సహా కనిపించకుండా పోయిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వసురం తండాకు చెందిన దేవాసత్ కావేరి (22) అనే వివాహిత తన రెండున్నర సంవత్సరాల కూతురుతో కలిసి ఈ నెల 28న ఆసుపత్రికి వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు…