భారత్ సమాచార్.నెట్, పెద్దపల్లి: పెద్దపల్లి నియోజకవర్గంలో ఆదివారం కురిసిన అకాల వర్షం అన్నదాతకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఓదెల, ఎలిగేడు మండలాలతో పాటు పలు ప్రాంతాల్లో చేతికొచ్చిన వరి పంట భారీ వర్షానికి నేలవాలింది. పచ్చని పొలాలన్నీ నీట మునిగి తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పండించిన ధాన్యం నేలపాలు కావడంతో, నష్టపోయిన తమను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.
మరిన్ని కథనాలు





