భారత్ సమాచార్.నెట్, మెదక్: తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ’ కార్యక్రమంలో భాగంగా భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. సుమారు 350 మంది ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొని ఆర్టీసీ బస్టాండ్ వద్ద స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరువ కావడమే ఈ కార్యక్రమ లక్ష్యమని పేర్కొన్నారు.…





