భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: మానవత్వమే సేవా ధ్యేయంగా పనిచేస్తున్న MDR ఫౌండేషన్ మరోసారి తన సేవా స్ఫూర్తిని చాటుకుంది. పటాన్‌చెరు పట్టణంలో ఒకే రోజు గుర్తుతెలియని ఇద్దరు మృతదేహాలకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఫౌండేషన్ సభ్యులు బాధ్యత తీసుకుని అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
మహంకాళి దేవాలయం వద్ద అనారోగ్యంతో ఉన్న ఓ వ్యక్తిని గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. మృతుడి కుటుంబ సభ్యుల…





