భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా, జిల్లాకు కేటాయించబడ్డ సాధారణ పరిశీలకులు భారతి లక్పతి నాయక్‌ను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్క అందించి వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన సాధారణ పరిశీలకులకు తెలియజేశారు.