భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: జోగిపేట్ మండలంలో పెద్దల అమావాస్య సందర్బంగా మటన్, చికెన్ విక్రయాలు జోరుగా సాగాయి. జోగిపేటలో మాంసంవిక్రయాలతో మార్కెట్ కిటకిట లాడింది. 500కు పైగా మేక, గొర్రెలను కోసి విక్రయించినట్లుగా సమాచారం. అందోల్ మండలంలోని చుట్టు పక్కల గ్రామస్తులు సైతం జోగిపేటకు వచ్చి కొనుగోలు చేశారు. ఉదయం 4గంటల నుంచే విక్రయాలు ప్రారంభమయ్యాయి. పెద్దల అమావాస్య రోజున చనిపోయిన వ్యక్తులకు నైవైద్యం పెట్టడం ఆనవాయితీ.
పెద్దల అమవాస్యకు జోరుగా మాంసం విక్రయాలు





