భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు భూ సమస్యలు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, ఇతర పరిపాలనా అంశాలకు సంబంధించిన వినతిపత్రాలను అధికారులకు అందజేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి దరఖాస్తును బాధ్యతాయుతంగా పరిశీలించాలని అదనపు కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమం ప్రజలకు…





