భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: జిల్లాలో రైతులు, అధికారులు, వివిధ శాఖల సమన్వయంతో యాసంగి ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నాగేష్, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్‌తో పాటు వ్యవసాయ, సివిల్ సప్లై, గ్రామీణాభివృద్ధి, పోలీసు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొనుగోలు ప్రక్రియలో ఎదురైన సవాళ్లను సమర్థవంతంగా అధిగమించి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ పూర్తి చేసినందుకు…