భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఓటరు జాబితాల ఖచ్చితత్వం కోసం చేపడుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సోమవారం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రజల్లో ఉన్న అపోహలను నమ్మవద్దని ఆమె స్పష్టం చేశారు.

 

ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభమైన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్, మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ పోలింగ్ స్టేషన్ నంబర్ 135లో జరుగుతున్న ప్రక్రియను ప్రత్యక్షంగా సమీక్షించారు.…