భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలోని మీట్యా తండా ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ ప్రత్యేక చొరవతో తండాకు మినరల్ వాటర్ ప్లాంట్ మంజూరైనట్లు బీజేపీ జిల్లా నాయకులు గుగులోతు నవీన్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.
గత కొంతకాలంగా శుద్ధీకరించిన నీరు అందుబాటులో లేక తండావాసులు అనారోగ్యం బారిన పడుతున్న విషయాన్ని గుర్తించిన హుస్సేన్ నాయక్, వెంటనే స్పందించి ఈ ప్లాంట్ మంజూరుకు కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల తండా…





