భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండలం కుక్కునూరు గ్రామంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటిముందు పార్క్ చేసిన నాలుగు ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. గ్రామానికి చెందిన కొన్యాల నర్సింలు, భాను ప్రసాద్, తలారి భిక్షపతి, పోతుల యాదగిరి అనే వ్యక్తులకు చెందిన వాహనాలకు దుండగులు నిప్పు పెట్టడంతో రెండు ద్విచక్ర వాహనాలు పాక్షికంగా ధ్వంసం కాగా, రెండు పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. గతంలో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడంతో స్థానికులు…