భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి: కల్హేర్ మండలం మహాదేవ్‌పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక భరోసా లభించింది. నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి తమ నివాసంలో మాగి అంజవ్వకు రూ.15వేలు, నీరుడి లలితకు రూ.12వేలు విలువైన చెక్కులను అందజేశారు. వారి ఆసుపత్రి వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన ఈ సహాయం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సుధాకర్, సంతోష్, బాల్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు





