భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కౌడిపల్లి మండలం తునికి గ్రామంలోని నల్ల పోచమ్మను మంగళవారం ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలలో భాగంగా ఒడి బియ్యం సమర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునితారెడ్డి మాట్లాడుతూ.. శ్రీ దుర్గమ్మ..పోచమ్మ కృపాకటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనీ, పాడిపంటలతో సుభిక్షంగా ఉండే విధంగా అమ్మవారిని వేడుకున్నామన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సార రామాగౌడ్, నాయకులు కవితా అమర్ సింగ్, ఎల్లమయ్య, గుంజరి…