భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించి, బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్‌ఓ)తో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల నుంచి సేకరిస్తున్న వివరాలు, దరఖాస్తుల పరిశీలన, నమోదు ప్రక్రియపై ఎమ్మెల్యే ఆరా తీశారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి…