భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ పథకం భరోసానిస్తుందని ఎమ్మెల్యే సునితారెడ్డి పేర్కొన్నారు. కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన నీలం బాలమని అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. ఆమెకు ప్రభుత్వం నుంచి మంజూరైన ₹రూ.1,80,000 ఎల్వోసీ పత్రాన్ని హైదరాబాద్ మాదాపూర్ లోని ఆమె నివాసంలో లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సునితారెడ్డి అందజేశారు, ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు కుత్బోధ్ధీన్, రామాంజనేయులు, ప్రతాప్, రవి సాగర్, తదితరులు పాల్గొన్నారు.