భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: మునగ సాగుపై రైతులు దృష్టి సారించాలని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని ఎంపీడీవో సంకీర్త్ సూచించారు. మంగళవారం పినపాక మండల కేంద్రంలో గల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మునగ సాగుకు ఉపాధి హామీ పథకంలో 100% సబ్సిడీతో ఎకరానికి రూ. 1.20 లక్షలు లభిస్తాయని, మార్కెట్‌లో డిమాండ్ ఉందని తెలిపారు. ప్రభుత్వం రాయితీలు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, సంప్రదాయ పంటలకు బదులు లాభదాయకమైన మునగ సాగుపై దృష్టి పెట్టాలని రైతులకు సూచించారు.…