భారత్ సమాచార్.నెట్, మెదక్: వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు బుధవారం ఉత్సాహంగా జరిగాయి. మాజీ అధ్యక్షుడు పేట స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గుండికాడి శేకులు, ఉపాధ్యక్షులుగా సండ్రు రవి, పుల్లబోయిన పెద్ద గంగులు, ప్రధాన కార్యదర్శిగా జాల ఆంజనేయులు, దాసరి దినేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోశాధికారిగా దుబాసి నర్సింలు, గౌరవ అధ్యక్షుడిగా ఆశమ్మ కిష్టయ్య బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డిని సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు.…